Ravi Teja: 'మాస్ జాతర'తో ముందుకురానున్న రవితేజ 3 d ago

రవితేజ 'మాస్ జాతర' ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా, రవితేజ తన తదుపరి చిత్రం కోసం కిశోర్ తిరుమలతో పాటు, 'మ్యాడ్' ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్‌కు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించనున్న ఈ చిత్రం సూపర్ హీరో జానర్లో సాగే సోషియో ఫాంటసీ చిత్రంగా ఉంటుందని సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఇది తిరుమల సినిమా కన్నా ముందుగా సెట్స్ పైకి వెళ్తుందా ? లేక దాని తరువాత ప్రారంభమవుతుందా? అన్నది తేలాల్సి ఉంది. రవితేజ మాస్ జాతర సినిమా ఈ వేసవిలో థియేటర్లలోకి రానుంది.